పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు*

 *పిల్లల పెంపకంలో 21 అద్భుత సూత్రాలు*

అనేటువంటి ఈ పుస్తకం

*ఎమెస్కో*

వారిచే ప్రచురించబడింది.


Smt.Satyavanamma & JD Lakshminarayana గార్లు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు..

ప్రపంచంలో ఏ తల్లిదండ్రులనైనా అడిగితే.. తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి కలలు ఒకేలా ఉంటాయి. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, మంచి చదువులు చదివి ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటారు. నిజాయితీ, మానవత్వం వంటి నైతిక విలువలతో నలుగురిలో ఆదర్శంగా నిలవాలని ఆశిస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించాలని ప్రతి అమ్మానాన్నా కలలు కంటారు.

కానీ, కాగితంపై రాసుకున్న ఈ ఆశలకు, వాస్తవ జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది.

నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఆనందాలు కరువైపోతున్నాయి. ఆత్మసంతృప్తి దూరమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పది నుంచి ఇరవై శాతం మంది పిల్లలు చిన్న వయసులోనే—ముఖ్యంగా పద్నాలుగేళ్ల లోపే—మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారన్నది కాదనలేని సత్యం.

ఈ పుస్తకం ద్వారా మనం ఆలోచించాల్సిన అసలు విషయం ఇక్కడే ఉంది. పిల్లలకు ఏది మంచిదో శాసించడం కాదు ముఖ్యం; జీవితాన్ని ఒక సానుకూల దృక్పథంతో చూడటం వారికి నేర్పించాలి. వారి ఇష్టాలను గౌరవిస్తూ, వారు ఎంచుకున్న మార్గంలో నడిచే స్వేచ్ఛను ఇవ్వాలి. రేపు జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా, కుంగిపోకుండా దానిని ధైర్యంగా ఎదుర్కొనే మానసిక శక్తిని వారికి అందించాలి.

అప్పుడే మన పిల్లలు తాము ఎంచుకున్న ఏ రంగంలోనైనా, ఏ మార్గంలోనైనా నడుస్తూ.. జీవితాంతం నిజమైన ఆనందాన్ని, సంపూర్ణ తృప్తిని సొంతం చేసుకోగలరు. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులుగా మనం వారికి ఏ విధంగా తోడుగా ఉండాలన్నదే ఈ పుస్తకపు ప్రధాన ఉద్దేశం….

ఈ పుస్తకం కావలసినవారు

Rs.75 /- phone pay / Google pay

9908511257 

చేసి మీ అడ్రస్సు పేమెంట్ స్క్రీన్ షాట్ ఈ నెంబర్ కి పంపించగలరు..

#DrAnkam

Pillala Pempakamlo 21 Adbhuta Sutralu by   డా. ఆర్.బి. అంకం

Dr. R.B. Ankam

 “పిల్లలు పుట్టే వరకూ మీరు నవదంపతులు. పిల్లలు కలిగిన తరువాత ఆ కుటుంబమనే బండికి తల్లిదండ్రులు చక్రాల్లాంటి వారు. ఆ బండిలో కూర్చునే వారు పిల్లలు. అంటే -? వివాహమనే వినోద స్థితి నుండి బాధ్యతాయుతమైన కుటుంబ స్థితికి వస్తున్నారన్నమాట” ఎంత అర్థవంతమైన మాట ఇది ! మరీ ఆ పిల్లలను పెంచడమనే బాధ్యతా బరువును తేలికపరచే అద్భుతమైన సూత్రాలతో కూడిన పుస్తకం ఇది.

https://youtu.be/AU7k9GkL-nI

Comments

Popular posts from this blog

పిల్లల పెంపకంలో 'నీటి' తత్వం: బ్రూస్ లీ చెప్పిన అద్భుతమైన పాఠం

ఉప్పు సత్యాగ్రహానికి గాంధీజీ; నెయ్యి సత్యాగ్రహానికి పవన్ కళ్యాణ్ జీ

మాతృభాష: మన అస్తిత్వం - మన గౌరవం