టైటిల్: గెలుపు గుర్రాలు.. జంగిల్ రూల్స్.. అండ్ ది రియల్ పవర్!
టైటిల్: గెలుపు గుర్రాలు.. జంగిల్ రూల్స్.. అండ్ ది రియల్ పవర్!
చూడబ్బా.. ఇక్కడ అందరికీ అన్నీ తెలిసిపోతుంటాయి. ఎవడో ఎక్కడో గెలిచాడని, ఇంకెవడో ఎక్కడో ఓడిపోయాడని.. వీటన్నిటినీ కలిపేసి ఒక 'మిక్సీ'లో వేసి జ్యూస్ తీసి, దానికి "పొలిటికల్ అనాలిసిస్" అని పేరు పెట్టేస్తుంటారు. అసలు సినిమాకి, పాలిటిక్స్‌కి.. ఒక స్టేట్‌కి, ఇంకో స్టేట్‌కి సంబంధం ఏంటని అడిగితే ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు. కానీ ట్రోల్స్ మాత్రం అదిరిపోతాయి.
అనుభవం అంటే వైట్ హెయిర్ కాదు.. పడిన దెబ్బలు!
పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదనే వాళ్ళకి ఒక మాట.. అనుభవం అంటే ఏళ్ల తరబడి కుర్చీలు పట్టుకుని వేలాడటం కాదు, జనం కోసం ఎన్ని దెబ్బలు తిన్నావనేది ముఖ్యం. చిరంజీవి గారు రక్తాన్ని దానం చేయడం నేర్పితే, ఈయన ఆ రక్తంలో ఉండాల్సిన రోషాన్ని గుర్తుచేశారు. సేవా కార్యక్రమాలు అంటే ఫోటోలకి ఫోజులివ్వడం కాదు.. కౌలు రైతు చనిపోతే తన సొంత డబ్బు తీసి ఆ ఇంటికి భరోసా ఇవ్వడం. అది సోషల్ థాట్ అంటే! అది ఒక ఎమోషన్. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గట్స్ ఉండాలి.
విజయ్ అక్కడ.. పవన్ ఇక్కడ.. లాజిక్ ఎక్కడ?
తమిళనాడులో విజయ్ గెలిచారు, కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ సింగిల్‌గా వెళ్తే ఏదో అయిపోయేది అని మాట్లాడుతున్న మేధావులకి.. బాబు, ఇది జంగిల్ కాదు, ఇది డెమోక్రసీ! ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా ఉంటుంది. అక్కడ లెక్కలు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు.
మరీ ముఖ్యంగా ఈ 'జంగిల్' ట్రోల్స్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళకి సినిమాటిక్ కంపారిజన్స్ ఎక్కువైపోయాయి. ఒకడు గెలిస్తే ఇంకొకడిని తక్కువ చేయడం కాదు.. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్నది 'రాజకీయ స్వార్థం' కాదు, 'రాష్ట్ర భవిష్యత్తు'. ఆయన సింగిల్‌గా వెళ్లాడా, కలిసి వెళ్లాడా అన్నది పక్కన పెడితే.. ఆయన వేసిన అడుగు వల్ల రిజల్ట్ మారిందా లేదా? అది కదా పాయింట్!
సింహం సింగిల్‌గా వస్తుందో.. గుంపుగా వస్తుందో పక్కన పెట్టు!
సింహం ఎలా వచ్చినా వేట మాత్రం గ్యారెంటీ! పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానం వెనుక ఒక క్లారిటీ ఉంది. ఆయనకి పదవుల మీద వ్యామోహం ఉంటే ఎప్పుడో ఏదో ఒక కుర్చీలో సెటిల్ అయిపోయేవారు. కానీ ఆయనకి కావాల్సింది మార్పు.
ట్రోల్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు.. ఎందుకంటే వాళ్ళకి పని లేదు కాబట్టి. కానీ ఇక్కడ పని చేసేవాడు పని చేసుకుంటూ వెళ్తుంటాడు. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు నోర్లు అవే మూతపడతాయి. ఎవడో ఏదో అన్నాడు అని రూట్ మార్చుకోవడానికి ఇక్కడ ఉన్నది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు.. ఒన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.
కటౌట్లు చూసి కాదు నాయనా.. కడుపులో ఉన్న కసి చూసి భయపడండి. అది ఆయన పాలిటిక్స్!
Dr.Rambabu Ankam.
Comments
Post a Comment