లోకేష్ గారు సైన్యం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు…?
*లోకేష్ గారు సైన్యం ఎలా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు…?*
రాజకీయాల్లో సరికొత్త 'నైతిక గ్రామర్' మొదలైంది!
రాజకీయ 'నైతిక గ్రామర్': లోకేష్ మార్క్ నిపుణుల సైన్యం!
తెలుగు నేల రాజకీయాల్లో ఇప్పుడు ఒక సరికొత్త పరివర్తన కనిపిస్తోంది. అది కేవలం అధికార మార్పిడి కోసం జరుగుతున్న పోరాటం కాదు; రాజకీయాల నిర్వచనాన్నే మార్చే ఒక నిశ్శబ్ద విప్లవం. నాడు ఎన్టీఆర్ రాజకీయాలకు ప్రజల 'రూపం' ఇస్తే, చంద్రబాబు నాయుడు దానికి ఒక సుదూర 'విజన్' అందించారు. నేడు ఆ వారసత్వానికి 'ప్రొఫెషనలిజం' మరియు **'టెక్నాలజీ'**ని జోడిస్తూ, నారా లోకేష్ ఒక కొత్త **'నైతిక గ్రామర్'**ను జోడించాలని యువత కోరుకుంటుంది…
*నిపుణుల వేదికగా చట్టసభలు*:
గతంలో ఎన్టీఆర్ గారు మేధావులను, నిజాయితీ గల అధికారులను ఆహ్వానించి రాజకీయాలకు ఒక '*నైతిక గ్లామర్'* ను తెచ్చారు. అదే పంథాలో లోకేష్ గారు తన టీమ్‌లోకి 'డొమైన్ ఎక్స్‌పర్ట్స్' (విషయ నిపుణులు)ను ఆహ్వానిస్తే మంచిదని నేటి తరం Gen-Z కోరుకుంటున్నారు.
కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, విద్య, వైద్య, ఉపాధ్యాయ , వ్యాపారరంగాలలో అసెంబ్లీ వేదికగా పరిష్కారాలు చూపే మేధావులు ఈ జట్టులో ఉంటే బాగుంటుంది అని చాలా వర్గాలు కోరుకుంటున్నాయి.
*లోకేష్ వ్యూహం ఎలా ఉంటే బాగుంటుంది…?*
క్లీన్ ఇమేజ్.. షార్ప్ విజన్
వారసత్వం ఉన్నా లేకున్నా.. ప్రతిభే పాస్‌పోర్ట్‌గా లోకేష్ తన అభ్యర్థుల ఎంపికను చేపట్టాలి.
• కార్పొరేట్ & సోషల్ లీడర్స్: సమాజంలో తమకంటూ గుర్తింపు ఉన్న యువ పారిశ్రామికవేత్తలను, స్వచ్ఛంద కార్యకర్తలను ప్రోత్సహించడం.
• రిటైర్డ్ ఆఫీసర్స్: అవినీతి మరక లేని మాజీ అధికారులను ఆహ్వానించి 'గుడ్ గవర్నెన్స్'కు పెద్దపీట వేయడం.
• లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్: రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో సేవ చేస్తున్న నిష్పక్షపాత నాయకులను గుర్తించడం.
సెలెక్షన్ కాదు.. 'కన్విక్షన్'
లోకేష్ గారి ఎంపికలో కేవలం గెలుపు గుర్రాలే కాదు, ఒక స్పష్టమైన 'కన్విక్షన్' కనిపించాలి. "ఈ వ్యక్తిని నేను ఎందుకు ఎంచుకున్నాను? ఈయన గెలిస్తే ఆ ప్రాంతానికి వచ్చే ప్రయోజనం ఏమిటి?" అని ఆయన ధైర్యంగా వివరించాలి
*ఐటీ నిపుణుడిని ఎంపిక చేయడం అంటే.. ఆ ప్రాంత యువతకు ఉద్యోగాల హామీ అని చెప్పడం ఆయన కొత్త రాజనీతి కావాలి*
ఎన్టీఆర్ నైతికత, బాబు గారి అనుభవం, లోకేష్ గారి టెక్నాలజీ—ఈ మూడింటి కలయికే రేపటి ఆంధ్రప్రదేశ్‌కు అసలైన దిక్సూచి. రాజకీయం అంటే కేవలం ఓట్లు సేకరించడం కాదు, సమర్థవంతమైన వ్యవస్థను నిర్మించడం అని నిరూపిస్తూ.. లోకేష్ తన ప్రత్యేక మార్గంలో దూసుకుపోవాలని ఆయన ఫాలోవర్స్ కోరుకుంటున్నారు
✅ వారసత్వం కాదు.. ప్రతిభే రాజకీయాలకు పాస్‌పోర్ట్ కావాలి.
#NaraLokesh #PoliticalGrammar #NewAndhra #TDP #LeadershipEvolution
"రాజకీయం అంటే గెలుపు కోసం చేసే వేట కాదు.. అభివృద్ధిని నడిపించే ఒక వృత్తి అని నిరూపిస్తున్న సరికొత్త బాట."
నారా లోకేష్ గారు నిర్మిస్తారని ఆశిద్దాం…
Dr.Rambabu Ankam



Comments
Post a Comment