లోకల్ నుండి గ్లోబల్ వరకు "జెన్-జీ కింగ్ మేకర్ నారా లోకేష్!"

భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ దేశం మన జనాభాలో దాదాపు 65% మంది 35 ఏళ్లలోపు వారే. ఈ 'డెమోగ్రాఫిక్ డివిడెండ్'ను దేశాభివృద్ధికి వాడుకోవాలంటే రాజకీయాల్లో కేవలం అనుభవమే కాదు, యువతరం యొక్క ఆధునిక ఆలోచనా దృక్పథం కూడా అత్యవసరం.

ఈ నేపథ్యంలో, నవ్యాంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణంలో నారా లోకేష్ అవశ్యకత ఏంటో చూద్దాం:

2029 ఎన్నికలు భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలవబోతున్నాయి. 'జెన్-జి' (Gen Z) , అత్యధిక సంఖ్యలో యువ ఓటర్లు ఈ ఎన్నికల ఫలితాలను శాసించబోతున్నారు. యువ నాయకత్వం  దేశ భవిష్యత్తును నిర్దేశించే *'డ్రైవింగ్ ఫోర్స్'*గా మారబోతోంది.

2029  నాటికి భారతదేశం ఒక అద్భుతమైన సంధి కాలంలో ఉంటుంది. యువత కేవలం 'ఓటర్లు'గా మాత్రమే మిగిలిపోకుండా, దేశ గమ్యాన్ని మార్చే 'నిర్ణేతలు' కావాలి. రాబోయే ఎన్నికల నాటికి యువత ఏ విధంగా ఉంటే వారి భవిష్యత్తు మరియు జాతి భవిత అద్భుతంగా ఉంటుందో నారా లోకేష్ గారు గుర్తించినప్పుడు.

జెన్-జీ ఐకాన్: నవ్యాంధ్ర గమ్యాన్ని మార్చే 'నారా లోకేష్' గా

క్లిక్ టు ప్రోగ్రెస్: జెన్-జీ తరం మెచ్చిన టెక్నోక్రాట్ లీడర్ గా, 

నెక్స్ట్ జనరేషన్ కెప్టెన్ గా, 

డిజిటల్ ఆర్కిటెక్ట్ గా …

నారా లోకేష్ గారి  పరిపాలన చరిత్ర లో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది…


నారా లోకేష్ గారు

ప్రముఖంగా దృష్టి పెట్టాల్సిన వాటిలో Gen-z ఆశయాలు కొన్నింటిని ఇక్కడ మనం ప్రస్తావిద్దాం: 

జెన్-జీ (Gen Z-1990-  2010మధ్య జన్మించిన యువత) - 


1.కేవలం ఒక 'ఓటు బ్యాంకు' మాత్రమే కాదు, వారు దేశ రాజకీయ యవనికను శాసించే సరికొత్త 'నిర్ణేతలు'. 

2.కేవలం నినాదాలను ఇచ్చే ప్రభుత్వం కంటే, క్షేత్రస్థాయిలో మార్పును చూపించే 'ఫలితాల ఆధారిత' ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

3.సిద్ధాంతాల కంటే 'పనితీరు'కే ప్రాధాన్యం.

4.కులం, మతం లేదా పార్టీ భావజాలాలకు గుడ్డిగా కట్టుబడి లేరు.

5.ప్రాగ్మాటిజం :

వారు "ఏ పార్టీ అధికారంలో ఉంది?" అనే దానికంటే "ఏ పార్టీ మాకు మెరుగైన ఉపాధిని, నాణ్యమైన విద్యను అందిస్తుంది?" అని ఆలోచిస్తున్నారు.

6.అథెంటిసిటీ : వారు పాలిష్ చేసిన రాజకీయ ప్రసంగాల కంటే, లోపాలను ఒప్పుకుని నిజాయితీగా పరిష్కరించే 'నిజమైన' నాయకులను ఇష్టపడుతున్నారు.

7.టెక్నోక్రాటిక్ నాయకత్వం :

డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నాయకులను కోరుకుంటోంది.

8.నవకల్పన :

ఏఐ (AI), బ్లాక్‌చైన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై అవగాహన ఉండి, పాలనలో వాటిని వాడే నాయకులు వీరికి ఆకర్షణీయంగా కనిపిస్తారు.

9.పారదర్శకత: ప్రభుత్వ సేవలు మొబైల్ ఫోన్‌లోనే, ఒక క్లిక్‌తో పారదర్శకంగా అందాలని వారు ఆశిస్తారు.




10.నిరుద్యోగం' నుండి 'నైపుణ్యం' వైపు: 

జెన్-జీల  ఆందోళన నిరుద్యోగం. కానీ ; వారు కేవలం 'ప్రభుత్వ ఉద్యోగాల' కోసం వేచి చూడటం లేదు.

11. స్కల్లింగ్:

    స్కిల్ సెన్సస్' :తమలో ఉన్న టాలెంట్‌కు తగిన వేదికను సృష్టించే  వారిని కోరుకుంటున్నారు.

12.ఎంటర్‌ప్రెన్యూర్షిప్: 

    స్టార్టప్‌లను ప్రోత్సహించే, యువతను 'జాబ్ క్రియేటర్స్'గా మార్చే ఆర్థిక విధానాలకు వారు మద్దతు ఇస్తున్నారు.

13.సుస్థిరత , సామాజిక బాధ్యత

    పర్యావరణం మరియు సామాజిక న్యాయం విషయంలో ఈ తరం చాలా స్పష్టంగా ఉంది.

14. క్లైమేట్ యాక్షన్: 

    పర్యావరణ పరిరక్షణను ఒక ఎన్నికల ఎజెండాగా మార్చే నాయకులను వారు వెతుకుతున్నారు. 

15.సమ్మిళిత అభివృద్ధి:

    ఏ వర్గాన్ని విస్మరించకుండా అందరినీ కలుపుకుపోయే నాయకత్వం వీరి ప్రధాన డిమాండ్.

16.జెన్-జీలు కోరుకునే 'సారథి' లక్షణాలు:

* మొండితనం :కష్టకాలంలో నిలబడి పోరాడే నాయకుడు.

* కనెక్టివిటీ: సోషల్ మీడియాలో నిరంతరం అందుబాటులో ఉంటూ, నేరుగా ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడు.

* నిజాయితీ: అవినీతికి తావులేని, పారదర్శకమైన చరిత్ర కలిగిన వ్యక్తి.


17.ఇన్నోవేటివ్ లీడర్‌షిప్:

* స్పేస్ మరియు ఏఐ: నేడు భారత్ 300కు పైగా స్పేస్ స్టార్టప్‌లతో దూసుకుపోతోంది. జెన్-జీ యువత డిఫెన్స్, స్పేస్, మరియు ఏఐ (AI) రంగాల్లో భారత్ విశ్వగురువుగా ఎదగాలని ఆకాంక్షిస్తోంది.


18.స్టార్టప్ కల్చర్: వారు 'జాబ్ సీకర్స్' నుండి 'జాబ్ క్రియేటర్స్' గా మారాలని కోరుకుంటున్నారు.


19..వర్క్-లైఫ్ బ్యాలెన్స్: వారు కేవలం సంపాదన కోసమే కాకుండా, మానసిక ప్రశాంతతకు మరియు వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యతనిచ్చే వాతావరణాన్ని కోరుకుంటున్నారు.


20.జెన్-జీలు ఒక 'భవిష్యత్ సిద్ధమైన' ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వారు కోరుకునేది 'రాజకీయ రొంపి' కాదు, 'రాష్ట్ర/దేశ నిర్మాణంలో భాగస్వామ్యం'.


జెన్-జీ తరం కోరుకునేది ఉచితాలు కాదు.. అవకాశాలు. ఆ అవకాశాల సృష్టికర్తగా నారా లోకేష్ . "విజన్ 2047" దిశగా సాగుతున్న భారతదేశ ప్రయాణంలో, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక సమర్థవంతమైన సారథిగా లోకేష్  గారు యువతకు భరోసానిస్తే..

2029 సమరంలో జెన్-జీ సైన్యాన్ని నడిపించే అసలైన 'కెప్టెన్' ఆయనే.

”జెన్-జీ హార్ట్ బీట్ - లోకేష్ స్మార్ట్ రూట్!" …


Dr.Rambabu Ankam

Comments

Popular posts from this blog

ఉప్పు సత్యాగ్రహానికి గాంధీజీ; నెయ్యి సత్యాగ్రహానికి పవన్ కళ్యాణ్ జీ

పిల్లల పెంపకంలో 'నీటి' తత్వం: బ్రూస్ లీ చెప్పిన అద్భుతమైన పాఠం

మారుతున్న కాలం - మారుతున్న పేరెంటింగ్: ఐన్‌స్టీన్ నేర్పిన పాఠం