ఒక అధ్యాపకుని ఆవేదన
ఒక అధ్యాపకుని ఆవేదన ...
ఈ రోజు .. ఒక దేశం .
వారం తిరిగే లోపు.. ఇంకో దేశం .
లగ్జరీ హోటల్స్ లో బస .
కోరిన తిండి .. ఇంకా ఇతరత్రా !
చేతిలో డబ్బుంది .. అక్కడ అందుబాటులో ఉన్న అమ్మాయిలతో జల్సా !
ఫుల్ సంపాదన .
దీనికి తోడు లక్షలాది మంది ఫాలోవర్లు . పేరు ప్రఖ్యాతులు .
బ్యాంకు లో అయిదు కోట్లు .
ఇలాంటి జీవితాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది ?
"లైఫ్ అంటే ఇలా ఉండాలి.. మనదీ ఒక బతుకేనా ?
ఉద్యోగం / వ్యాపారం .. ఇల్లు ... ఎప్పుడూ గానుగెద్దు బతుకు " అనుకుంటున్నారా ?
కంటికి కనిపించేదంతా నిజం కాదు .
ఇంకో కోణం చూద్దాము రండి !
1 . క్రానిక్ స్ట్రెస్ .
ఉద్యోగం / వ్యాపారం వేరు . వాటిలో కూడా సమస్యలు ఉన్న మాట వాస్తవం .
కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ / యూ ట్యూబర్ ల జీవితాలు వేరు . వీక్షకుల టేస్ట్ నిరంతరం మారుతూ ఉంటాయి . ఎప్పటికప్పుడు న్యూ కంటెంట్ జెనెరేట్ చెయ్యాలి . జనాలకు బోర్ కొట్టకూడదు . ఐడియాస్ అయిపోతాయి . చూసి చూసి జనాలకు మొఖం మొత్తేస్తుంది .
"ఎప్పుడూ ఇదే సోదిరా" అనుకొంటే వ్యూస్ తగ్గిపోతాయి . ఫేడ్ అవుట్ అయిపోవడం ఖాయం . కొత్త వీడియో లు ఎలా తయారు చెయ్యాలా అనేది నిరంతరం స్ట్రెస్ ను కలుగచేస్తుంది.
జీవితానికి గ్యారెంటీ ఉండదు .
ఎవరీ డే స్ట్రెస్ .
ఒక్క మాటలో చెప్పాలంటే పులి పై స్వారీ .
2 .సిరికార్డియం రిధం డిసార్డర్ .
మన దేహానికి ఒక బయలాజికల్ క్లోక్ ఉంటుంది .
వాతావరణం .. టైమింగ్స్ కు బాడీ అలవాటు పడిపోతుంది . ఎప్పుడో ఆరునెలలకు ఒక ట్రావెల్ .. కొత్త ప్రదేశం .. డిఫరెంట్ టైమింగ్స్ .. బాడీ అడ్జస్ట్ అవుతుంది . పైగా రొటీన్ కి బిన్నంగా థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది .
ఆలా కాకుండా సంవత్సరాల తరబడి ట్రావెల్ చేస్తూ ఉంటే ?
ప్రతి వారం జెట్ లాగ్ సమస్య ఎదురైతే ?
కొత్త టైం జోన్ , కొత్త వాతావరణం .. కొత్త సంస్కృతి ..
బాడీ అడ్జస్ట్ కాదు . నిద్ర సరిగా పట్టదు . మూడ్ డిస్టర్బ్ అవుతుంది .
3 .డోపమైన్ హై .
ఎండలో చాల సేపు తిరిగాక నీళ్లు తాగితే దానికి ఎంత రుచో . బాగా ఆకలిగా వున్నప్పుడు అన్నం ఎంత కమ్మగా ఉంటుందో . జీవితం లో వెలుతురు చీకటి .. రాత్రి పగలు .. ఇది ప్రకృతి నియమం .
చేతిలో డబ్బుంది కదా అని ప్రతి రోజూ స్టార్ హోటల్స్ .. లగ్జరీ .. ఫుడ్ .. బెడ్ ..
ఏమవుతుంది ?
దీన్నే సైన్స్ డోపామైన్ హై అంటుంది .
లగ్జరీ సుఖాన్ని ఇవ్వదు .
అందరికీ అర్థం అయ్యేలా చెబుతాను .
బాగున్నాయి కదా అని రోజుకు మూడు చొప్పున ప్రతి రోజూ లడ్లు తింటే ? నెల తిరిగాక లడ్డు వాసన చూస్తేనే వాంతి కమింగ్ !
4 . సామాజిక ఏకాంతవాసం !
ప్రతి మనిషికీ కుటుంబం కావాలి . తల్లితండ్రి .. భార్య / భర్త .. పిలల్లు .. ఏళ్ళ తరబడి కుటుంబానికి దూరంగా ఉంటే ? హోటల్స్ లో ఉన్నా .. అక్కడ డబ్బు ద్వారా దొరికే సావాసాలు ఉన్నా .. ఒంటరి తనం .. స్ట్రెస్ .
క్రానిక్ స్ట్రెస్ .. సిరికార్డియన్ రిధం డిసార్డర్ .. డోపమైన్ హై .. సబ్స్టేన్స్ అబ్యూస్ .. సోషల్ ఐసోలేషన్ .. ఇవన్నీ కలిస్తే ?
బైపోలార్ డిజార్డర్ !
ఇదొక మానసిక వ్యాధి .
దీని లక్షణాలు .
1 . మూడ్ స్వింగ్స్ .
కాసేపు ఉత్సాహం .. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం .. కాసేపట్లో లో ఎనర్జీ .. సాడ్నెస్ ..
2 . నోటికి ఏమి వస్తే అది మాట్లాడడం .. ఇంగిత జ్ఞానం మరిచి ప్రవర్తించడం ..
3 . విచక్షణ చచ్చి .. పిచ్చి పిచ్చి ఆలోచనలు .. అవతలి వారిని తిట్టడం .. బూతులు .. శాపనార్థాలు .
4 . వారించే కొద్దీ మరింత రెచ్చిపోయి ప్రవర్తించడం .
ఈ పోస్ట్ లో నేను ఎవరి గురించి చెబుతున్నానో ఇప్పటికే మీకు అర్థం అయిపోయివుంటుంది .
పిచ్చుక పై బ్రహ్మస్రం వేసేవాడిని కాను .
ఒక పక్క మానసిక రోగం ముదిరి .. మరో పక్క కేసుల్లో చిక్కి చిప్పకూడు తింటూ యూట్యూబ్ ఆదాయం నిల్ అయిపోయి జీవితం శిధిలం కాబోతున్న వ్యక్తి పై పోస్ట్ పెట్టి టైం వేస్ట్ చేసుకొనే స్థాయి కాదు నాది .
చేసుకొన్నవాడికి చేసుకున్నంత .
ఒక టీచర్ గా నిజజీవిత ఉదాహరణలు తీసుకొని పాఠాలు చెప్పడం నాకు అలవాటు .
ఈ పోస్ట్ మీ కోసం .
ముఖ్యం గా రీల్స్ .. యూట్యూబర్ .. social మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ .. లాంటి వాటి వైపు ఆకర్షితులు అవుతున్న యువత కోసం .
1 . ఇవి తాటాకు మంటలు . జీవితాంతం నిలిచే కెరీర్ లు కావు . జీవితం లో స్థిరపడ్డాక మీలో క్రియేటివిటీ ఉంటే జస్ట్ ఒక హాబీ గా ఇలాంటివి చెయ్యొచ్చు . అంతే కానీ చదువుకొనే వయసులో ఇలాంటి వాటికోసం అర్రులుచాచితే బతుకు బస్టాండ్ .
2 . పేరుప్రఖ్యాతులు వెన్నెల కాంతులు . ఎస్ ... కాసేపు . ఎంజాయ్ చెయ్యొచ్చు .
కానీ వెన్నెల కాంతిని తినలేము .. తాగలేము .
3. పేరు ప్రఖ్యాతులు రెండు వైపులా పదునున్న కత్తులు . ఒక దశలో మంచి పేరు వచ్చి అటు పై జీవితం నిస్తేజంగా మరి పొతే ? మానసిక కుంగుబాటు వస్తుంది . సిల్క్ స్మిత . ఫటాఫట్ జయలక్ష్మి ... సుశాంత సింగ్ రాథోడ్ .. ప్రత్యూష బెనర్జీ , జియా ఖాన్ .. ఇంకా పదుల కొద్దీ సెలబ్రిటీస్ .. ఎందుకు ఆత్మ హత్య చేసుకొన్నారు ? ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం .. వెలుగు వెలిగి ఇప్పుడు దయనీయ జీవితాన్ని అనుభవిస్తున్న తెలుగు హిందీ తమిళ్ హీరో లు హీరోయిన్ లు ఎంత మంది ?
బతకడం ఒక కళ .
1 పనిని ప్రేమించండి . పనే ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది . హార్డ్ వర్క్ .. అంతకు మించి స్మార్ట్ వర్క్ అవసరం .
2 . కుటుంబాన్ని ప్రేమించండి . కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితుల తో కాలం గడపండి .
3 . ఇంట్లో వంట . వంట గది మూతబడితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది . మగ పిల్లలకు కూడా వంట నేర్పించండి .
4 . మొబైల్ సాధనాలను కేవలం ప్రొఫషనల్ అవసరాల కోసం వాడండి .
5 . తమ సొంత లాభం కోసం వివాదాలను సృష్టించే సోషల్ మీడియా జలగల పట్ల జాగ్రత్త . ఆ సుడిగుండం లోకి దూకొద్దు .
గుర్తు పెట్టుకోండి . సోషల్ మీడియా కేటు మనుషులు మైరావణులు . ఒక తలనరికితే పది తలలు పుట్టుకొచ్చి నట్టు .. మీరు తిడుతూ కామెంట్ పెట్టినా అది వారికి మరింత పబ్లిసిటీ తెస్తుంది . సరిగ్గా వారికి కావాల్సింది కూడా ఇదే . అలాంటి కంటెంట్ ను బ్లాక్ చెయ్యండి . హ్యాపీ గా కాలం గడపండి . పాజిటివ్ కంటెంట్ చూడండి . మంచి వినోదాన్ని ఆస్వాదించండి .
Comments
Post a Comment