Posts

Showing posts from February, 2026

లోకల్ నుండి గ్లోబల్ వరకు "జెన్-జీ కింగ్ మేకర్ నారా లోకేష్!"

Image
నారా లోకేష్ గారు ప్రముఖంగా దృష్టి పెట్టాల్సిన వాటిలో Gen-z ఆశయాలు కొన్నింటిని ఇక్కడ మనం ప్రస్తావిద్దాం:  జెన్-జీ (Gen Z-1990-  2010మధ్య జన్మించిన యువత) -  1.కేవలం ఒక 'ఓటు బ్యాంకు' మాత్రమే కాదు, వారు దేశ రాజకీయ యవనికను శాసించే సరికొత్త 'నిర్ణేతలు'.  2.కేవలం నినాదాలను ఇచ్చే ప్రభుత్వం కంటే, క్షేత్రస్థాయిలో మార్పును చూపించే 'ఫలితాల ఆధారిత' ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. 3.సిద్ధాంతాల కంటే 'పనితీరు'కే ప్రాధాన్యం. 4.కులం, మతం లేదా పార్టీ భావజాలాలకు గుడ్డిగా కట్టుబడి లేరు. 5.ప్రాగ్మాటిజం : వారు "ఏ పార్టీ అధికారంలో ఉంది?" అనే దానికంటే "ఏ పార్టీ మాకు మెరుగైన ఉపాధిని, నాణ్యమైన విద్యను అందిస్తుంది?" అని ఆలోచిస్తున్నారు. 6.అథెంటిసిటీ : వారు పాలిష్ చేసిన రాజకీయ ప్రసంగాల కంటే, లోపాలను ఒప్పుకుని నిజాయితీగా పరిష్కరించే 'నిజమైన' నాయకులను ఇష్టపడుతున్నారు. 7.టెక్నోక్రాటిక్ నాయకత్వం : డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నాయకులను కోరుకుంటోంది. 8.నవకల్పన : ఏఐ (AI), బ్లాక్‌చైన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై అవగాహన ఉండి, పాలనలో వాటిని వాడే నాయకులు వ...

నారా లోకేష్ : ఆధునిక రాజకీయాల్లో నిశ్శబ్ద పోరాట యోధుడు… నిలువెత్తు రాజకీయ వ్యక్తిత్వ శిఖరం…

Image
 నారా లోకేష్ అంటే కేవలం ఒక ముఖ్యమంత్రి కుమారుడు మాత్రమే కాదు,  ఓర్పు, కార్యదక్షత , ఆధునిక దృక్పథం ,  సాంకేతికతను సామాన్యుడి జీవితంలోకి తీసుకురావాలనే తపన ఉన్న నాయకుడిగా  పరిపాలన దక్షుడు . ఆయన వ్యక్తిత్వం భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుంది. రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం ఒక ప్రవేశ పత్రం మాత్రమే, కానీ గెలుపు అనేది సొంతంగా సాధించుకోవాల్సిన సామ్రాజ్యం. నారా లోకేష్ గారు ఈ సత్యాన్ని అడుగడుగునా నిరూపిస్తూ.    వారసత్వాన్ని ఒక అలంకారంగా కాకుండా, ఒక బాధ్యతగా భావించారు. వారసత్వాన్ని గెలిపించిన వ్యక్తిత్వం తో , నిశ్శబ్ద కార్యదక్షత, స్థితప్రజ్ఞత, అలవర్చుకున్న   నారా లోకేష్ గారి స్టాన్‌ఫోర్డ్ చదువు.. పల్లెటూరి నడక: ఆధునిక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి సామాన్యుడి గొంతుక వరకు: మారిన పరిణామ క్రమం." ఆయనకు గోల్డెన్ పీకాక్ అవార్డు తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు. "అపహాస్యం నుండి అభివాదం వరకు: లోకేష్ అప్రతిహత ప్రయాణం , మౌనమే ముగింపు కాదు.. అది ఒక మహా గర్జనకు శ్రీకారం అని మంగళగిరి ఎన్నికల్లో నిరూపించారు. ఇదంతా ఆయన వ్యక్తిత్వం , అయితే పార్టీని నడిపిస్తూ పార...

ఉప్పు సత్యాగ్రహానికి గాంధీజీ; నెయ్యి సత్యాగ్రహానికి పవన్ కళ్యాణ్ జీ

Image
ఉప్పు సత్యాగ్రహం దేశాన్ని ఏకం చేసింది అని మనకు తెలుసు   కానీ ఇప్పుడు  నెయ్యి సత్యాగ్రహం చేయాల్సిన అవసరం ఉందా….? ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్న వివాదానికి మరియు 1930ల కాలంలో జైపూర్ సంస్థానంలో జరిగిన నెయ్యి సంఘటనలకు మధ్య ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, సామాజిక మరియు నైతిక కోణంలో కొన్ని లోతైన పోలికలు కనిపిస్తున్నాయి. నేపథ్యం 1930ల నాటికి భారతదేశంలోకి వనస్పతి ప్రవేశించింది. జైపూర్ రాజ్యంలో స్వచ్ఛమైన ఆవు /గేదె నెయ్యి వినియోగం ఎక్కువగా ఉండేది. * వనస్పతి నెయ్యిని జంతువుల కొవ్వుతో కలుపుతున్నారనే వదంతులు వ్యాపించాయి. * పర్యావరణపరంగా, ఆరోగ్యపరంగా వనస్పతి నెయ్య సమాజానికి చేటు చేస్తుందని ప్రజలు భావించడం వల్ల  "వనస్పతి నెయ్యి వ్యతిరేక ఉద్యమం “ మొదలై 1936 లో మరణహోమం జరిగి   పోలీసు కాల్పుల్లో దాదాపు 10 నుండి 15 మంది మరణించారని  చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పుడైతే దీన్ని మనం నెయ్యి సత్యాగ్రహంగానే పిలవాల్సి వస్తోంది… ఆ కాలంలో స్వచ్ఛమైన నెయ్యి ప్రాముఖ్యత మరియు కల్తీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని ఈ సంఘటన నిరూపించింది. చారిత్రక కోణం : ఈ సంఘటన కేవల...

సివిల్ సర్వీసెస్ మరియు హ్యూమనిటీస్: యంత్రాల యుగంలో మానవీయ విలువల ఆవశ్యకత

Image
సివిల్ సర్వీసెస్ మరియు హ్యూమనిటీస్: యంత్రాల యుగంలో మానవీయ విలువల ఆవశ్యకత యూపీఎస్సీ (UPSC) పరీక్షల్లో సుమారు 73.7% మంది అభ్యర్థులు హ్యూమనిటీస్ (Humanities) సబ్జెక్టులను ఎంచుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ సాగే ప్రత్యేక వ్యాసం ఇది. పరిచయం: వస్తువులు vs మనుషులు "దేవుడు మనకు మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువులను వాడుకోవడానికి ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు మనం వస్తువుల్ని ప్రేమిస్తూ, మనుషుల్ని వాడుకుంటున్నాం" - ఒక సినీ రచయిత అన్న ఈ మాటలు నేటి సమాజ స్థితికి అద్దం పడుతున్నాయి. యంత్రాలు మనుషులను ప్రేమిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుండే 'రోబో' వంటి సినిమాలు పుట్టాయి. భూమి మీద మనుషులు ఆవిర్భవించిన తర్వాతే వస్తువులు, యంత్రాలు సృష్టించబడ్డాయనే నిఖార్సైన సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే నేడు హ్యూమనిటీస్ అధ్యయనం మరింత ఆవశ్యకమైంది. హ్యూమనిటీస్ అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే, "మానవత్వం మరియు మానవ సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే హ్యూమనిటీస్." సైన్స్ సబ్జెక్టులు భౌతిక ప్రపంచం మరియు ప్రయోగాల గురించి వివరిస్తే.. హ్యూమనిటీస్ మనిషి యొక్క సంస్కృతి, చరిత్ర, ఆలోచనలు మరియు సమా...