ఒక అధ్యాపకుని ఆవేదన
ఒక అధ్యాపకుని ఆవేదన ... ఈ రోజు .. ఒక దేశం . వారం తిరిగే లోపు.. ఇంకో దేశం . లగ్జరీ హోటల్స్ లో బస . కోరిన తిండి .. ఇంకా ఇతరత్రా ! చేతిలో డబ్బుంది .. అక్కడ అందుబాటులో ఉన్న అమ్మాయిలతో జల్సా ! ఫుల్ సంపాదన . దీనికి తోడు లక్షలాది మంది ఫాలోవర్లు . పేరు ప్రఖ్యాతులు . బ్యాంకు లో అయిదు కోట్లు . ఇలాంటి జీవితాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది ? "లైఫ్ అంటే ఇలా ఉండాలి.. మనదీ ఒక బతుకేనా ? ఉద్యోగం / వ్యాపారం .. ఇల్లు ... ఎప్పుడూ గానుగెద్దు బతుకు " అనుకుంటున్నారా ? కంటికి కనిపించేదంతా నిజం కాదు . ఇంకో కోణం చూద్దాము రండి ! 1 . క్రానిక్ స్ట్రెస్ . ఉద్యోగం / వ్యాపారం వేరు . వాటిలో కూడా సమస్యలు ఉన్న మాట వాస్తవం . కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ / యూ ట్యూబర్ ల జీవితాలు వేరు . వీక్షకుల టేస్ట్ నిరంతరం మారుతూ ఉంటాయి . ఎప్పటికప్పుడు న్యూ కంటెంట్ జెనెరేట్ చెయ్యాలి . జనాలకు బోర్ కొట్టకూడదు . ఐడియాస్ అయిపోతాయి . చూసి చూసి జనాలకు మొఖం మొత్తేస్తుంది . "ఎప్పుడూ ఇదే సోదిరా" అనుకొంటే వ్యూస్ తగ్గిపోతాయి . ఫేడ్ అవుట్ అయ...